పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపారు తెలంగాణ ప్రజలు. హస్తం పార్టీకి అవకాశం కల్పించారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతగా ఉన్న మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తమకు శాసనసభలో ఎలా వ్యవహరించాలనే అంశంతో పాటు, రాజ్యాంగపరమైన అనేక విషయాలను తెలియజేశారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం నుంచి మంగళవారం సాయంత్రం వరకూ దాదాపు 36 గంటల సమయం ఇదే హోటల్‌లో ఎమ్మెల్యేలతో కలసి ఉన్నారు. నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలందరితో విడివిడిగా మాట్లాడారు. భవిష్యత్తులో చేపట్టబోయే పనులు, తీసుకోవాల్సిన చర్యలు, ఎమ్మెల్యేల నుంచి, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి అవసరమైన సహకారంపై చర్చించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది.
గురువారం ఉదయం 10.28 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఆ సమయాన్ని మార్చారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యనేతలు, నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారు.