అసెంబ్లీ తొలి సమావేశంలోనే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. తన ప్రసంగంలో దూకుడు ప్రదర్శించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే క్రమంలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
తమకు 57 మంది బలం ఉందని, మీకు 65 మంది ఉన్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని చిన్న జలక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు.
అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు.. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలుసూచనలు ఇచ్చారు.