ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారామె. 2020లో ఆమ్రపాలికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడే డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు. గతంలో ఆమె కేంద్రంలో విధులు నిర్వహించారు.
ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు తిరిగి వచ్చారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా రేవంత్ రెడ్డి సర్కారు కీలక బాధ్యతలు అప్పగించింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా అత్యంత చురుకైన ఐఏఎస్ లలో ఆమె ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. విశాఖటప్నంలో విద్యాభ్యాసం అనంతరం 2010లో యూపీఎస్సీ సివిల్స్ లో సత్తా చాటారు.
39వ ర్యాంకు సాధించారు. తర్వాత ట్రైనీ ఐఏఎస్ గా, జాయింట్ కలెక్టర్ గా, నగర కమిషనర్ గా పనిచేశారు. 2018 సంవత్సరంలో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్ గా పనిచేశారు. అనంతరం డిప్యుటేషన్ పై ప్రధాన మంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతల్ని నిర్వర్తించారు.