సీతక్కని ఇంత ఆవేశంగా ఎప్పుడు చూసుండరు. దీంతో రేవంత్ రియాక్షన్ చుడండి.

పేద మహిళలు ప్రయాణించేది ఆర్టీసీ బస్సుల్లోనే అని.. అలాంటి పేద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం కల్పిస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారామె. మహిళలకు ఫ్రీ బస్సు ఉండాలా.. వద్దా అనే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వాలని.. పేద మహిళలకు ఎందుకు ఫ్రీ బస్సు జర్నీ వద్దని ఎందుకు అంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క.

అయితే గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్‌కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడం బిఆర్‌ఎస్ నేతల నైజం అని మండిపడ్డారు. గతంలో బిఆర్‌ఎస్ నేత పెట్రోల్ పోసుకున్నారు కానీ అగ్గిపుల్ల దొరకలేదా? అని చురకలంటించారు.

బిఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టడంతోనే అమాయకులు చనిపోయారని సీతక్క ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లను బిఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని, ఆటోలను ముందు పెట్టి బిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూస్వాములు లక్షల రూపాయలు రైతు బంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆర్ టిసి ఆస్తులను బిఆర్ఎస్ నాయకులు ధ్వంసం చేశారని సీతక్క ఆరోపణలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *