మళ్లీ కలుస్తారా..? విడాకుల ఆలోచన విరమించుకున్న ధనుష్‌, ఐశ్వర్య..?

ధనుష్‌, ఐశ్వర్య..వైవాహిక జీవితంలో 18 సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట కొన్ని మనస్పర్ధలు కారణంగా పెళ్లైనటువంటి 18 సంవత్సరాలకు విడిపోయారు.ఇలా ఈ జంట విడిపోతున్నామని ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. అయితే ధనుష్‌, ఐశ్వర్య.. ఇద్దరూ వారివారి పనుల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం వారి ఫోకస్‌ అంతా కెరీర్‌ పైనే ఉంది తప్ప భార్యాభర్తలుగా మళ్లీ కలిసిపోవాలన్న ఆలోచన అయితే ముమ్మాటికీ లేదు.

కావున, వీరు మళ్లీ కలిసిపోనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేనట్లు సమాచారం. అయితే వీళ్లు విడిపోయారే కానీ ఇంతవరకు విడాకులకు దరఖాస్తు చేయలేదు. మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడో లేదంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని లైట్‌ తీసుకుంటున్నారట.. తర్వాత ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చులే అని ఆలోచిస్తున్నారట! భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ ఒకరిపై మరొకరికి ఎనలేని గౌరవం ఉంది.

పిల్లల కోసం కొన్ని కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొనక తప్పడం లేదు. కానీ తిరిగి కలిసిపోయే ఛాన్స్‌ మాత్రం కనిపించడం లేదు! సినిమాల విషయానికి వస్తే.. ధనుష్‌ ప్రస్తుతం కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే తన 50వ సినిమాకు సన్నద్ధమవుతున్నాడు. హాఫ్‌ సెంచరీ కొట్టే సినిమాలో ధనుష్‌ నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐశ్వర్య రజనీకాంత్‌ లాల్‌ సలాం సినిమా నిర్మాణ పనులను చూసుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *