బిగ్‌ బాస్‌ ఇంట్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రతిక, దీంతో ప్రశాంత్‌ ఏం చేసాడో తెలుసా..?

టే రతిక మరోసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తు్న్నట్లు తెలుస్తోంది. గతంలో బిగ్‌బాస్‌ సీజన్‌- 2 సమయంలో కూడా నూతన్‌ నాయుడుకు రీ ఎంట్రీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఆమెను మరోసారి బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకురానున్నారట. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో. అయితే ప్రస్తుతం హౌజ్‌లో ముగ్గురు మాత్రమే మహిళా కంటెస్టెంట్లు ఉన్నారు. దాంతో బిగ్‌ బాస్‌ ఇంట్లో బ్యాలెన్స్ తప్పింది అని చెప్పవచ్చు.

ఈ సీజన్‌ చాలా బిన్నంగా ఉంటుందని, ఉల్టా పుల్టా అని ఏవేవో కథలు చెప్పారు బిగ్‌బాస్‌. కానీ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పవచ్చు. గత సీజన్‌లాగే ఈ సీజన్ కూడా తేలిపోయిందని కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం హౌజ్‌లో సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో గేమ్‌ చప్పగా నడుస్తుంది. సభ్యులు నిండుగా ఉన్నప్పుడూ అంతే.. దీంతో వచ్చే వారంలో మరో ఏడుగురు కంటెస్టెంట్లుగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. వీరిలో రతిక కూడా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

రతికకు రీ ఎంట్రీ అవకాశం బిగ్‌ బాస్‌ ఇవ్వాలని సోషల్‌ మీడియాలో ఆమె ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌- 2 సమయంలో నూతన్‌ నాయుడుకు రీ ఎంట్రీ అవకాశం కల్పించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అదే విధంగా రతికకు కూడా మరో అవకాశం ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్‌ కోరుతున్నారు.. రీ ఎంట్రీ అనేది బిగ్‌ బాస్‌ అనుకుంటే జరగడం ఖాయం.. ఎందుకంటే ఉల్టా పుల్టా అని ముందే చెప్పారు కదా.. సో ఈ లెక్కన హౌజ్‌లో రోజ్‌ గ్లామర్‌ నింపేందుకు రతికను తీసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *