పవర్ స్టార్ తో విడాకులు తర్వాత పిల్లలనే ప్రాణంగా భావిస్తూ బతికేస్తోంది. కొడుకు అకీరా నందన్, కూతురు ఆధ్యను అపురూపంగా పెంచుకుంటూ కాలం గడిపేస్తోంది. గత కొద్ది నెలల క్రితం ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. నిశ్చితార్థం కూడా జరుపుకుంది. కానీ, చివరి నిమిషంలో ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. అయితే ఒకప్పటి యాక్ట్రెస్ రేణూదేశాయ్.
రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆడియన్స్ ముందుకు మళ్ళీ రాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న ఈమె.. ఎన్నో ఆసక్తికర విషయాలను ఆడియన్స్ కి తెలియజేస్తుంది. ఈక్రమంలోనే ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రేణూదేశాయ్ కి సంపాదన ఎలా వస్తుంది. ఆమెకు సినిమా వృత్తే కాకుండా ఇంకేమి వ్యాపారం చేస్తుంది అనే విషయాలను తెలియజేసింది.
రేణూదేశాయ్ కి రియల్ ఎస్టేట్ వ్యాపారం మెయిన్ ఆదాయమార్గం అంటా. తన ఫ్యామిలీలో నాయనమ్మ, నాన్న అదే వృత్తి చేసేవారట. ఇక వారి నుంచి రేణూదేశాయ్ కి కూడా అదే వృత్తి పారంపరంగా వచ్చిందట. ప్రస్తుతం హైదరాబాద్, పూణేలో ఈ బిజినెస్ చేస్తుంది. ఈక్రమంలోనే ఈ రెండు చోట్ల ఈమెకు బాగానే ఆస్తిలు ఉన్నాయట. అలా వచ్చిన మనీతోనే అటు పిల్లలని, అప్పుడప్పుడు సినిమా నిర్మాణంలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంది.