అక్టోబరు 30న అంటే సోమవారం రాత్రి కాక్‌టైల్ పార్టీ గ్రాండ్ జరిగిపోయింది. అక్టోబరు 31న అంటే మంగళవారం ఉదయం 11 గంటలకు హల్దీ, సాయంత్రం 5:30 గంటలకు మెహందీ వేడుక జరగనుంది. ఇక బుధవారం మధ్యాహ్నం 2:48 గంటలకు వరుణ్, లావణ్య మెడలో తాళి కట్టనున్నాడు. అయితే ఇదిలా ఉంటే వరుణ్ తేజ్- లావణ్యల వివాహాంపై ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్లకు హాజరైన ఆమె వరుణ్ పెళ్లికి వెళ్లడం లేదంటూ కామెంట్స్ చేశారు. ‘నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదు. నా పిల్లలు ఆద్య, ఆఖీరాలు వెళ్లారు. ఇక వరుణ్ తేజ్ నా కళ్ల ముందే పెరిగాడు. నా ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయి. ఒకవేళ నేను వరుణ్ పెళ్లికి వెళ్తే అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశముంది. అందుకే వెళ్లట్లేదు. అకీరా, ఆద్య కూడా పెళ్లికి హాజరుకావడం లేదు’ అని చెప్పుకొచ్చారు రేణూ దేశాయ్.
సుమారు 20 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై దర్శనమిచ్చారు రేణూ దేశాయ్. ఆమె నటించిన టైగర్ నాగేశ్వర రావు సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఇందులో రేణూ పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. స్టువర్ట్ పురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటించారు.