మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు వంటి తదితరమైన వ్యాధుల వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా దోమల వల్ల పిల్లలు, వృద్ధులకు చాలా ప్రమాదం. ఈ కాలంలో లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే టీ ట్రీ ఆయిల్‌లో ఉండే సమ్మేళనాలు దోమలను తరిమేస్తాయి. అందువల్ల దీన్ని శరీరంపై రాసుకుంటే చాలు.. ఒక్క దోమ కూడా మన దగ్గరకు రాదు. పైగా ఇది సహజసిద్ధమైంది కనుక మన శరీరానికి, ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. కనుక దీన్ని చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే నిర్భయంగా వాడవచ్చు.
టీ ట్రీ ఆయిల్ మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దీన్ని కొని తెచ్చి రాత్రి పూట నిద్రకు ముందు శరీరానికి రాయాలి. చర్మం బయటకు కనిపించే భాగాల్లో దీన్ని రాయాలి. అంతే.. రాత్రంతా సుఖంగా నిద్రించవచ్చు. కరెంటు లేకపోయినా.. ఫ్యాన్ నడవకపోయినా సరే.. మనల్ని అయితే దోమలు కుట్టవు. దీంతో దోమల నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది. ఇక దోమలను నియంత్రించేందుకు మనకు మరో అద్భుతమైన చిట్కా కూడా పనిచేస్తుంది. అదేమిటంటే.. మీరు బిర్యానీ ఆకులను కూడా చూసి ఉంటారు. వీటిని బిర్యానీ, పులావ్ వంటి వాటిల్లో వేస్తారు. మసాలా కూరల్లోనూ వేస్తుంటారు.
అయితే ఈ ఆకును ఒకదాన్ని తీసుకుని గదిలో వెలిగించి మంటను ఆర్పేయాలి. దీంతో దాని నుంచి పొగ వస్తుంది. దీన్ని గది అంతా విస్తరించేలా చూడాలి. ఆ సమయంలో తలుపులు, కిటికీలు అన్నీ మూసేయాలి. తరువాత గది నుంచి బయటకు వచ్చి అలాగే ఒక గంట పాటు ఉంచాలి. దీంతో ఈ ఆకు పొగ వాసన గది అంతటా విస్తరిస్తుంది. తరువాత తలుపులు, కిటికీలు తెరిచినా ఏమీ కాదు. దోమలు లోపలికి రాలేవు. దీంతో దోమల నుంచి రక్షణ లభిస్తుంది. ఇలా ఈ రెండు చిట్కాలను పాటిస్తే దోమలను నియంత్రించవచ్చు. దీంతో విష జ్వరాలు, ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయి.
దోమలను నియంత్రించడంలో టీ ట్రీ ఆయిల్‌తోపాటు బిర్యానీ ఆకు కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. కనుక కృత్రిమ పద్ధతులను పాటించే బదులు ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించని సహజసిద్ధమైన పద్ధతులను పాటించండి. దీంతో ఆరోగ్యానికి హాని కలగకుండా లాభాలు పొందవచ్చు. దోమలను తరిమేయవచ్చు.