‘ఆ పనికి ఓకే చెబితే వెంటనే షూటింగ్ అన్నారు’ రెజీనా సంచలన వ్యాఖ్యలు.

కాస్టింగ్‌ కౌచ్‌.. ఈ పదం గురించి సగటు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటే తమను కాంప్రమైజ్‌ కావాలని దర్శకనిర్మాతలు అడిగారంటూ కొందరు నటీమణులు బహిరంగంగానే స్పందించారు. చిన్న చిన్న హీరోయిన్ల నుంచి స్టార్‌ నటీమణుల వరకు తమకు జీవితంలో ఇలాంటి చేదు ఘటనలు ఎదురయ్యాయని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. హీరోయిన్లు చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాతో పాటు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలోనూ ఎంతటి సంచలనంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర ..SMS చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లింది. ప్రస్తుతం ఈ సుందరి తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో చిత్రాల్లో నటిస్తోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ యంగ్ హీరోలతో కలిసి నటించిన రెజీనా..ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో..మెగాస్టార్ చిరంజీవితోనూ కలిసి నటించింది. చిరు నటించిన మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’లో స్పెషల్ సాంగ్ చేసింది రెజీన. ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే సాంగ్ లో చిరుకు పోటీగా స్టెప్పులేసి అదరగొట్టింది రెజీనా కసాండ్ర.

అయితే.. తాజాగా హీరోయిన్ రెజీనా కసండ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కు గురయ్యానని హీరోయిన్ రెజీనా కసండ్రా తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం చూస్తుండగా ఓ వ్యక్తి కాల్ చేసి….’అడ్జస్ట్మెంట్ కి ఓకే అంటే ఛాన్స్ ఇస్తా. వెంటనే షూటింగ్ కూడా మొదలు పెడదాం’ అని అన్నట్లు ఆమె వెల్లడించారు. అప్పుడు ఆమెకు అడ్జస్ట్మెంట్ అంటే తెలియదని… తన మేనేజర్ చెబితే తెలిసిందన్నారు. ఆ తర్వాత ఎప్పుడు తనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *