జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా పాప్యులర్ అయ్యింది రీతూ చౌదరి. కెరీర్ బిగినింగ్ లో రీతూ చౌదరి సీరియల్స్ లో నటించారు. అక్కడ లాభం లేదని జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చింది. లేడీ కమెడియన్ గా స్కిట్స్ చేసింది. పలువురు టీమ్ లీడర్స్ తో పని చేసింది. జబర్దస్త్ కొంతలో కొంత ఆమెకు ఫేమ్ తెచ్చింది. అయితే రీతూ చౌదరి ప్రేమ, పెళ్లిపై ఎప్పుడూ కన్ఫ్యూషనే. రీతూ గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమికుడిగా పరిచయం చేసింది.
వారిద్దరి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ ప్రచారం జరిగింది. రీసెంట్ గా రీతూ ఫ్యాన్స్ తో ఆన్లైన్ లో ముచ్చటించారు. నిజాలు మాట్లాడుకుందాం పేరుతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో కొందరు ఆమెను వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. ఒకరు మీకు పెళ్ళెప్పుడు? అని అడిగారు. దానికి డోంట్ మ్యారీ బీ హ్యాపీ అని సమాధానం ఇచ్చింది. పెళ్లి వలన కష్టాలే… వివాహం చేసుకోవద్దన్న అర్థంలో ఆ కామెంట్ చేశారు. మరొకరు శ్రీకాంత్ అన్నతో మాట్లాడటం లేదా? అని అడిగారు.
లేదు అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన రీతూ దీని గురించి తర్వాత వివరంగా చెబుతానని సమాధానం ఇచ్చింది. మరొకరు నీకు లవర్ ఉన్నాడా? అని అడగ్గా… దండం సింబల్ పోస్ట్ చేసింది. రీతూ సమాధానాలు నేపథ్యంలో ఆమె ప్రియుడితో బ్రేకప్ అయ్యారని అందరూ భావించారు. అనూహ్యంగా శ్రీకాంత్ తో ఉన్న ఫోటోను రీతూ చౌదరి షేర్ చేశారు. సదరు రొమాంటిక్ ఫోటోకు సీతాకోకచిలుక ఎమోజీ జోడించింది. వీరిద్దరి పోజ్ చూస్తుంటే ఒకరిని మరొకరు ఘాడంగా ఇష్టపడుతున్నట్లుగా ఉంది. నేడు రీతూ చౌదరి మరో షాక్ ఇచ్చింది. పెళ్లి వీడియో షేర్ చేసింది.