వంశీకృష్ణారెడ్డి ఐడ్రీమ్ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. తమ విడాకులకు గల కారణాలు వివరించాడు. అంతేకాక విడాకులు ప్రకటన తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘మా విడాకులు గురించి ప్రకటించినప్పుడు చాలా మంది నాకు సపోర్ట్ ఇచ్చారు.
బాధపడకండి అని సూచించారు.. కొందరు మంచి నిర్ణయం అని ప్రశంసించారు. అయితే మనుషులంతా ఒకే విధంగా ఉండరు కదా. అందుకే కొందరు విమర్శలు చేశారు. నీ లైఫే సరిగ్గా లేదు.. నువ్వేంటి మాకు చెప్పేది అంటూ విమర్శించారు’’ అని ఎమోషనల్ అయ్యారు. ‘‘అలా విమర్శలు చేసే వారికి మా జీవితంలో ఏం జరిగిందో తెలియదు కదా.
వాళ్లు మాతో ట్రావేల్ చేయలేదు.. మా సమస్యలు వారికి తెలియలేదు. అయినా సరే ఊరికే కామెంట్స్ పాస్ చేస్తారు. అలాంటి వాళ్ల గురించి ఆలోచిస్తే మనం ప్రశాంతంగా ఉండలేము. అందుకే ఆ కామెంట్స్‌ని మనసుకు తీసుకోలేదు’’ అని చెప్పుకొచ్చారు. ఇక వ్యక్తిగత కారణాల వల్లే విడిపోయామని.. ఆ రీజన్స్ చెప్పలేనని తెలిపాడు.