పెద్ద నోట్లు లేకపోవడంతో గతంలో రద్దు చేసిన రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఊహగాహనాలపై ఆర్బీఐ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. రూ.1000 కరెన్సీ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకోలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే రూ.1000 నోటుపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. రూ.1000 నోటును చలామణిలోకి తెచ్చే యోచన లేదని, ఈ నోట్లను ముద్రించే ఆలోచనలో కూడా లేదని స్పష్టం చేసింది.
వార్తా సంస్థ ఏఎన్‌ఐ ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుతం రూ.1000 నోట్లను ముద్రించలేదు. ఇక దేశంలో 2000 రూపాయల విలువైన 10000 కోట్ల రూపాయల నోట్లు ఎక్కడున్నాయన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ నోట్లు మార్కెట్‌లో ఉన్నాయని చెబుతున్నప్పటికీ, ఈ నోట్లను ఎవరు ఉపయోగిస్తున్నారనేది మాత్రం వెల్లడి కాలేదు. చిల్లర వ్యాపారులు, దుకాణదారులు, సామాన్య పౌరులు ఈ నోట్లను మార్కెట్‌లో ఉపయోగించడం లేదు కాబట్టి, అసలు ఈ నోట్లను ఎవరు ఉపయోగిస్తున్నారు.? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెబ్‌సైట్ ప్రకారం.. 500, 1000, 10000 రూపాయల నోట్లను మొదటిసారి జనవరి 1946లో రద్దు చేశారు.
1000, 5000, 10,000 రూపాయల నోట్లను 1954లో, మళ్లీ 1978 జనవరిలో రద్దు చేశారు. ఆ తర్వాత 8 నవంబర్ 2016న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. ఇక ఇప్పటి వరకకు 2000 నోట్లు మిగిలి ఉన్నవారికి రిజర్వ్ బ్యాంక్ మరో అవకాశం ఇచ్చింది. అంటే బ్యాంకుల్లో కాకుండా ఆర్‌బీఐకి చెందిన 19 కార్యాలయాలు దేశంలో ఉన్నాయి. వాటిలో ఈ నోట్లను మార్చుకునే వెలుసుబాటు ఇచ్చింది. తగిన పత్రాలు చూపించి నోట్లను డిపాజిట్ చేయడమో లేక మార్చుకోవడమే చేసుకోవచ్చు. బ్యాంకులు, వాటి శాఖల్లో డిపాజిట్ చేయడానికి గడువు ముగిసినప్పటికీ ఆర్బీఐ ఈ విధంగా అవకాశం ఇచ్చింది.
RBI is not in consideration of the re-introduction of Rs 1000 note: Sources
— ANI (@ANI) October 20, 2023