రవితేజ.. మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు, ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘నీ కోసం’ సినిమాలో రవితేజ హీరోగా చేసాడు ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగిన రవితేజ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని చెప్పవచ్చు.
ఇక సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఏ హీరో పై అయినా రూమర్స్ రావడం కామన్. రవితేజ మీద కూడా అప్పట్లో ఒక రూమర్ క్రియేట్ అయింది. ఆయన స్టార్ హీరోయిన్ అనుష్కతో డేటింగ్ చేస్తున్నాడని, వీళ్లిద్దరు ముంబైలో ఒక ప్రముఖ స్టార్ హోటల్లో ఉంటూ కెమెరాలకు చిక్కుకున్నారని అప్పట్లో ఓ రూమర్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ఆ రూమార్ కాస్త రవితేజ ఇంట్లో వాళ్లకి తెలిసి పెద్ద గొడవ జరిగిందట.
ఆ రూమర్ క్రియేట్ అవ్వడానికి కారణం రవితేజ ఓ ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగగా దానికి బదులుగా అనుష్క అంటే నాకు చాలా ఇష్టం అని, ఆమె నటన చాలా బాగుంటుందని, అంతే కాకుండా ఆమె నాకు మంచి స్నేహితురాలు అని కూడా చెప్పాడు. ఇక అప్పటినుంచి వీరిద్దరిపై రూమార్స్ క్రియేట్ అయ్యాయి. తరువాత ఈ రూమర్స్ అన్నింటికి చెక్కు పడేలా రవితేజ క్లారిటీ ఇచ్చారట. ఇకపోతే రవితేజ ఇటీవల ‘ ధమాకా ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు, ఆ తరువాత ‘ రావణాసుర ‘ సినిమాతో డీలా పడిపోయాడు. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.