హీరోయిన్ రష్మిక మందన అభ్యంతరకర వీడియో వైరల్‌. సోషల్ మీడియాలో వీడియోల కలకలం.

మొదట అందరూ ఈ వీడియోలో ఉంది హీరోయిన్ రష్మికనే అనుకున్నారు. కాని ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే కాని అసలు విషయం బయటపడలేదు.అయితే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని సక్రమంగా వినియోగిస్తే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో.. దుర్వినియోగం అయితే ఎంత ప్రమాదమో తాజాగా జరిగిన ఓ ఘటన నిరూపిస్తోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత డీప్‌ ఫేస్‌ టెక్నాలజీ ద్వారా నటి రష్మిక మందాన వీడియోను రూపొందించారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విడుదల చేశారు. దీంతో వెంటనే ఈ వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియో అభ్యంతరకరంగా ఉండడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రష్మిక స్పందించారు. వీడియో ఒరిజినల్‌ కాదని, వీడియోలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మాట్లాడడం చాలా బాధగా ఉందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న డీప్‌ఫేక్‌ వీడియో తనకే కాకుండా చాలా మందికి భయానికి గురిచేస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా ఇతరులకు కృతజ్ఞత తెలుపుతున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటన తాను స్కూల్‌, కాలేజీలో ఉన్నప్పుడు జరిగితే తాను ఎలా ఎదుర్కోగలనో నిజంగా ఉహించలేనని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *