యానిమల్ .. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే రణ్‌బీర్ కపూర్ హీరోగా ఈ యానిమల్ రూపొందింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో సూపర్ క్రేజ్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమా డిసెంబర్ 1న భారీగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే పలు ప్రచార చిత్రాలు విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో.. టీమ్ శ్రద్దగా ప్రమోషన్స్ చేస్తోంది. అటు నార్త్, ఇటు సౌత్ లో కన్నడ భామ రష్మిక మందన్న ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాతో బిజీ హీరోయిన్ అయింది ఈ అందాల భామ.
కెమెరా ముందు తనదైన ప్రతిభ కనబర్చుతూ నేషనల్ క్రష్ గా క్రేజ్ కొట్టేసింది. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ పట్టేసిన ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉంది. టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటోంది. ఈ మేరకు అవకాశాల వేట కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే యానిమల్ మూవీ చేసింది.