రష్మిక డీప్ ఫేక్ వీడియోలో ఉంది ఈ అమ్మాయే, అసలు ఆ అమ్మాయి ఏం చేసిందంటే..?

టెక్నాలజీ ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో వీడియోను చూస్తే తెలుస్తోందని రష్మిక తన ఇన్​స్టాలో పోస్టు పెట్టింది. తాను ఒక నటిగా ఉన్నప్పుడు ఇది జరిగింది కానీ.. చదుకునే రోజుల్లో ఇలా జరిగి ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవో తలుచుకుంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది రాస్మిక. అయితే ష్మిక ముఖంతో డీప్ ఫేక్ వీడియో చేయడాన్ని పలువురు ఖండించారు. అమితాబ్, నాగ చైతన్యతో పాటు మరికొందరు రష్మికకు మద్దతుగా నిలిచారు. సాంకేతికత దుర్వినియోగం అవుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తలచుకుంటే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రష్మిక సైతం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తనకు మద్దతుగా ఉంటున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియో నేను కాలేజ్ లేదా స్కూల్ లో చదువుకునే రోజుల్లో వైరల్ అయితే పరిస్థితి ఏంటని వాపోయింది. కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనతో ఒరిజినల్ వీడియోలో ఉన్న మహిళ ఇండియాలో పాపులర్ అయ్యారు. ఆమె ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ని నెటిజెన్స్ చెక్ చేస్తున్నారు. రష్మిక పేరిట వైరల్ అయిన వీడియోలో ఉన్న యువతి పేరు జరా పటేల్. ఈమె భారతీయ మూలాలున్న బ్రిటన్ యువతి. అక్కడే పుట్టి పెరిగింది.

వృతి రీత్యా ఇంజనీర్ అట. మెంటల్ హెల్త్ అడ్వొకేట్ అని కూడా తన ప్రొఫైల్ లో మెన్షన్ చేసింది. జరా పటేల్ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే… హాట్ వీడియోలు, ఫోటో షూట్స్ తో నిండిపోయింది. ఆమె తరచుగా బోల్డ్ కంటెంట్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తారు. ఆమెకు నాలుగున్నర లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. జరా పటేల్ దృష్టికి ఫేక్ డీప్ వీడియో వెళ్ళింది. దీంతో ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు. ”అందరికీ హాయ్… నా బాడీ ఉపయోగించి ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారని నా దృష్టికి వచ్చింది.

ఆ డీప్ ఫేక్ వీడియోతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ పరిణామం నన్ను బాగా కలచి వేసింది. ఇకపై అమ్మాయిలు, మహిళలు సోషల్ మీడియాలో తన సమాచారం పంచుకునేందుకు చాలా భయపడతారు. సోషల్ మీడియా కంటెంట్ పై స్పందించే ముందు అందరూ నిజం ఏమిటో చెక్ చేసుకోండి…” అని ఆమె కామెంట్ చేశారు. జరా పటేల్ పోస్ట్ వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *