ప్రస్తుతం కమెడియన్, యాంకర్ మరియు సినిమాల్లో కూడా హీరోగా కూడా నటిస్తున్న సుధీర్ కి జబర్దస్త్ యాంకర్ రష్మి మధ్య ప్రేమాయణం నడుస్తుందని గత కొన్ని ఏళ్ళుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే సుధీర్ కనిపించినప్పుడల్లా రష్మీ సిగ్గు మొగ్గలేయడం, అలాగే ఆన్ స్క్రీన్ పై బోలెడన్ని సార్లు ఈ జోడీ పెళ్లి కూడా కావడంతో వీళ్ళ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది. రష్మీ- సుధీర్ సీక్రెట్ రిలేషన్ నడిపిస్తున్నారనే విషయంపై జనంలో ఓ రేంజ్ డిస్కషన్స్ నడిచాయి. ఈ పరిస్థితుల నడుమ ఎన్నోసార్లు అటు రష్మీ, ఇటు సుధీర్ ఓపెన్ అయ్యారు.
తమ మధ్య ఉంది స్నేహబంధం మాత్రమే అని, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ ఇద్దరి రిలేషన్ గురించి జనాల్లో డిస్కషన్స్ మాత్రం ఆగలేదు. ఈ పరిస్థితుల నడుమ తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్ లో కనిపించి సర్ ప్రైజ్ చేశారు రష్మీ- సుధీర్. ఇద్దరూ కలిసి నిజమేనే చెబుతున్నా జానే జానా పాటకు రొమాంటిక్ డాన్స్ చేసి యమ కిక్కిచ్చారు. ఆ తర్వాత రష్మీ గురించి మాట్లాడుతూ సుడిగాలి సుధీర్ తన మనసులో మాట బయటపెట్టేశారు. ఈ పరిస్థితుల నడుమ తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్ లో కనిపించి సర్ ప్రైజ్ చేశారు రష్మీ- సుధీర్.
ఇద్దరూ కలిసి నిజమేనే చెబుతున్నా జానే జానా పాటకు రొమాంటిక్ డాన్స్ చేసి యమ కిక్కిచ్చారు. ఆ తర్వాత రష్మీ గురించి మాట్లాడుతూ సుడిగాలి సుధీర్ తన మనసులో మాట బయటపెట్టేశారు. రష్మీతో నాది బ్యూటీఫుల్ జర్నీ.. ఆమె చాలా సెన్సిటివ్, హార్డ్ వర్కింగ్ పర్సన్. నాకు అందరికంటే ఎక్కువ ఆమెనే. మేం ఇద్దరం బయటకు వెళ్లినా.. మా ఫ్యామిలీతో బయటకు వెళ్లినా మా జోడి గురించే ఎక్కువగా అడుగుతుంటారు. నా బ్యూటిఫుల్ జర్నీలో, సక్సెస్‌లో రష్మీదే మెయిన్ రోల్ అని అన్నారు సుడిగాలి సుధీర్. రష్మీతో చేసిన ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, స్కిట్స్.. ఇలా అన్నీ సక్సెస్ అయ్యాయి.
కెరీర్‌లో నేను ముందుకెళ్లడానికి జబర్దస్త్‌లో నా కామెడీ స్కిట్స్‌తో పాటు రష్మీ పాత్ర చాలా కీలకమైంది అని సుధీర్ చెబుతుంటే.. పక్కనే ఉన్న రష్మీ ఎమోషనల్ అయింది. ఇవ్వన్నీ చెప్పిన సుడిగాలి సుధీర్ చివరలో ‘ఐ మిస్‌యూ’ అని చెప్పడంతో రష్మీ కంటతడి పెట్టుకుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మాటలతో మరోసారి రష్మీ- సుధీర్ లవ్ ట్రాక్ చర్చల్లోకి వచ్చింది.