రాశీ ఖన్నా తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాయకిగా నటించింది. డిగ్రీ చదువుకుని నటి, మొడల్ గా సినిపరిశ్రమకి పరిచయం అయినది. తెలుగులో మనం సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే తెలుగుతో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించింది. అయినా కూడా స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలే కరువైయ్యాయి.
ఎప్పుడో ఒకసారి తప్పితే పెద్దగా సినిమాలు చేయడం లేదు. దీంతో రాశీ ఖన్నా త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా ఆ మధ్య ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించి బ్రేకప్ అవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లానని.. దీంతో విపరీతంగా బరువు పెరిగానని, ఆ తర్వాత ఎంత ప్రయత్నించిన బరువు తగ్గలేదని పేర్కోంది. ఆ తర్వాత కొన్ని రోజులకి మరో వ్యక్తి పరిచయమయ్యాడని తెలిపింది. ఇక ఆ తర్వాత చాలా త్వరగా బరువు తగ్గానని.. అంతేకాదు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని… అతను తనకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటాడని మాట్లాడింది.
అయితే ఈ జంట ఫ్రెండ్షిప్ కాస్తా లవ్‌గా మారిందని.. త్వరలో పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం రాశీఖన్నాకు ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా అన్ని సినిమాల ఫ్లాప్స్ అవుతున్నాయి. మొన్న పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుందని అనుకుంటే ఈ సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈభామకు తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గాయి.