రావు రమేష్ నటుడు రావు గోపాలరావు, హరికథా కళాకారిణి అయిన కమల కుమారి దంపతులకు జన్మించాడు.రావు రమేష్ శ్రీకాకుళంలో జన్మించాడు, చెన్నైలో పెరిగాడు. అతను చెన్నైలో తన B. Com పూర్తి చేశాడు. అతను తన +2 లో పాఠశాల వదిలి బయటకు రావాలని కోరుకున్నాడు. ఆ సమయంలో ఫోటోగ్రఫీ ఆసక్తి కలిగి బ్రిటిష్ లైబ్రరీ & అమెరికన్ లైబ్రరీకి వెళ్ళి ఫోటోగ్రఫీ పుస్తకాలను అధ్యయనం చేసేవాడు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘ కొత్తబంగారులోకం ‘ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు రావు రమేష్. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన తర్వాత వరుస సినిమాలతో పాపులర్ అయ్యారు.
ఇంతకీ రావు రమేష్ ఎవరో కాదు పాత సినిమాలలో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న రావు గోపాల్ రావు తనయుడు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు రావుగోపాల్ రావు. ఆయన కొడుకే ఈ రావు రమేష్. తండ్రి నటన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎటువంటి పాత్రనైనా చేయగలిగే రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించేశారు. ఇకపోతే రావు రమేష్ శ్రీకాకుళం లో జన్మించారు. చెన్నైలో పెరిగారు. అయితే ఆయన నటుడు అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదట. నటనపై అంత ఆసక్తి కూడా లేదట.
మధ్యలో చదువు ఆపేసిన రమేష్ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే క్యాలిఫోర్నియా అకాడమీలో ఒక కోర్సుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రావు గోపాలరావు గారు మరణించారు. దీంతో తల్లి నటన వైపు వెళ్ళమని సలహా ఇచ్చిందట. అది ఇష్టం లేక ఎన్నోసార్లు జాబ్ కోసం వెతికాడు. నిర్మాణం వైపు అడుగులు వేయాలని ఓ నిర్మాతతో కలిసి సినిమాను తీశారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది దీంతో నష్టం కూడా వచ్చింది. తర్వాత చెన్నైలో పుట్టగొడుగుల బిజినెస్ స్టార్ట్ చేశారు అది కూడా ఫ్లాప్ అయింది. చివరకు తన తల్లి చెప్పిన మాట విని ఇండస్ట్రీలోకి వచ్చాడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ గా ఎదిగారు.