కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది మీనాక్షి చౌదరి. “ఇచ్చట వాహనములు నిలపరాదు” తెలుగు మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తన నటన, అందంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటించింది.
గతేడాది చివర్లో అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ మూవీతో తొలి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో మీనాక్షి చౌదరి ఫుల్ ఖుషీగా ఉంది. ఇపుడు అదే జోష్‌లో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నటిస్తోంది. గతేడాది చివర్లో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన హిట్ 2 మూవీకి ప్రేక్షకుల నుంచి అపూర్వమైన స్పందనతో కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇప్పటికే పలవురు ఈ సినిమా చూసి బాగుందని చిత్ర యూనిట్‌ను అభినందించారు. మరోవైపు ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన ఈ భామ త్వరలో తమిళంలో కూడా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతోంది. ‘కోలాయై’పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టకుంది ఈ భామ. మీనాక్షి చౌదరి విషయానికొస్తే.. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో అదరగొడుతోంది. ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ.. 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.