ఇప్పటి హీరోయిన్స్‌కు అంత సీన్ లేదు, అసలు విషయం చెప్పిన రమ్యకృష్ణ.

టాలీవుడ్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడంటే అత్త పాత్రలకు, తల్లి పాత్రలకు పరిమితమైంది. కానీ ఒకప్పుడు టాలీవుడ్ సహా తమిళ శని పరిశ్రమలు కూడా అవి ఏలేసింది. అయితే తాను నటించిన నరసింహ సినిమా గురించి ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అప్పట్లో గ్లామర్ కు రమ్యకృష్ణ పెట్టింది పేరు. ప్రస్తుతం రమ్యకృష్ణ పలు ల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆమెకు బాగా పేరుతెచ్చిన ఏది అంటే టాక్కున చెప్పే పేరు బాహుబలి అనే చెప్పాలి.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి లో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు పలు ల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ లో కనిపించారు. ఈ లో సూపర్ స్టార్ భార్యగా కనిపించారు రమ్యకృష్ణ. ఇదిలా ఉంటే తాజాగా రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అటు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఇండస్ట్రీలోరాణిస్తున్న యంగ్ హీరోయిన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు రమ్యకృష్ణ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ఒకప్పుడు హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ల్లో అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇలా కాదు. ఒక్క సక్సెస్ అయితే వరుసగా నాలుగు, ఐదు ల్లో ఛాన్స్ లు వస్తున్నాయి అని అన్నారు రమ్యకృష్ణ. మేము ఏళ్ల తరబడి హీరోయిన్స్ గా రాణించాం.. ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ 20-25 ఏళ్ల వరకు కెరీర్ కంటిన్యూ చేయలేకపోతున్నారని అన్నారు. అప్పట్లో మాకు తప్పులు చేయడానికి..వాటిని కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. మేము ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును ఇప్పటి హీరోయిన్స్ తక్కువ సమయంలోనే సంపాదిస్తున్నారు. టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు అని తెలిపారు రమ్యకృష్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *