సహజంగా ఏ సంస్థలో అయినా.. ఉద్యోగులు ఉంటారు. కానీ, వారి పాత్ర కొంత వరకు మాత్రమే పరిమితం. అంతకుమించి ఉన్నా..ఒకరిద్దరికి మాత్రమే ఉంటుంది. కానీ, రామోజీ గ్రూపు సంస్థల్లో ఈనాడు మొదలుకుని.. మార్గదర్శి వరకు.. అనేక మంది చిన్న స్థాయిలో సంస్థల్లో చేరి, అగ్ర పీఠాలు అందుకున్న వారు ఉన్నారు. లేఅవుట్ ఆర్టిస్టుగా ప్రస్థానం ప్రారంభించిన వారు.. తర్వాత కాలంలో దేశంలోనే నెంబర్ 1 కార్టూనిస్టుగా ఎదిగారు.
ఇక, మార్గదర్శిలోనూ చందాలు కట్టించే ఏజెంట్లు గా చేరిన వారు.. శాఖాధిపతులుగా ఎదిగారు. ఇలా.. అన్ని సంస్థల్లోనూ అనేక మంది ఉన్నతస్థాయి ఉద్యోగులుగా అభివృద్ధి చెందారు. దీనికి కారణం.. రామోజీ చూపించిన.. మార్గంలో క్రమశిక్షణగా ముందుకు నడవడమే! ఇదే వారికి కలిసి వచ్చింది. అయితే.. చివరి దశలో ఆయన వారికి అమూల్యమైన వీలునామా రాశారు. సంస్థకు అధిపతిగా.. ఆయన వారికి ఇచ్చిన ఆస్తి.. పంచిన ఆస్తి.. క్రమశిక్షణ, అంకిత భావం.
ఈనాడు లేదా.. మార్గదర్శి లేదా.. రామోజీ గ్రూపు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఎనలేని గుర్తింపు తీసుకువచ్చిం ది.. ఇవే. ఇదే విషయాన్ని తన చివరి పలుకుల్లో రామోజీరావు ప్రస్తావించారు. ప్రతి ఉద్యోగికీ సహజ సిద్ధం గా అలవడి న క్రమక్షణ, సమయ పాలన వింటివి కొనసాగించాలని.. తాను లేకపోయినా.. తన స్పూర్తి… పరిఢవిల్లేలా పనిచేయాలని ఆయన కోరారు. దశాబ్దాలుగా తన వెంటే నడిచిన సిబ్బందికి ఆయన ధన్య వాదాలు తెలిపారు.