ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ సంచలనాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చైంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ చైంజర్ సినిమా విడుదల కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ముంబైలోని సిద్ది వినాయకుడి ఆలయం చాలా ఫేమస్.
ఇక్కడికి ఎంతోమంది రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వస్తుంటారు. తాజాగా రామ్ చరణ్ కూడా సిద్ది వినాయకుడి ఆశీస్సుల కోసం అక్కడికి వెళ్లాడు. ఈ ఆలయానికి వెళ్లిన సమయంలో మరోసారి అయ్యప్ప మాలలో కనిపించాడు చరణ్. ప్రతి ఏటా అతడు అయ్య మాలధారణ చేస్తాడన్న విషయం తెలిసిందే. సిద్ది వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అక్కడి పూజారులు వారికి శాలువా కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
“గణపతి బప్ప మోరయా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని గ్రేటెస్ట్ నటుల్లో ఒకరైన అద్భుతమైన వ్యక్తి, మానవతావాది రామ్ చరణ్ భాయ్ తో కలిసి సిద్ది వినాయకుడి ఆలయానికి వెళ్లాం” అనే క్యాప్షన్ తో రాహుల్ ఈ ఫొటోలు, వీడియోను షేర్ చేశారు.