వేణు స్వామి.. ఈ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇదివరకు కూడా వినిపించేది కానీ సమంత విడాకుల తర్వాత మరింత ఎక్కువ పాపులర్ అయింది. దానికి కారణం నాలుగేళ్ళ కింద సమంత, నాగ చైతన్య పెళ్లి చేసుకున్నపుడే విడిపోతారని చెప్పిన జ్యోతిష్కుడు వేణు స్వామి. అప్పుడు ఆయన కామెంట్స్ విని అంతా కామెడీ అనుకున్నారు. డబ్బుల కోసం.. ఫేమ్ కోసం వంద చెప్తుంటారు అన్నీ నమ్మేస్తామా ఏంటి అని లైట్ తీసుకున్నారు. అయితే ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో వివాహానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా మీడియాతో కూడా వెల్లడించింది. అయితే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని జీవితాన్ని సంతోషంగా గడపాలనుకున్న రకుల్ కు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాక్ ఇచ్చారని చెప్పాలి. ఆమె వివాహం చేసుకుంటే విడాకులు తప్పవు అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. వేణు స్వామి మాట్లాడుతూ.. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంటే కలిసి రాదు అని ముందే చెప్పాను.
ఇక ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పటి నుంచి తన కెరీర్ ఎలా ఉందో మనమందరం చూస్తూనే ఉన్నాము. సరైన అవకాశాలు లేక కెరియర్ కోసం తెగ ఇబ్బంది పడుతోంది. ఒకవేళ నా మాటలు కాదని రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకుంటే మరో సమంత అవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోతారు. అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్ చేయడం ఇప్పుడు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తానికైతే వేణు స్వామి చేసిన కామెంట్లు కొంతమంది నిజమని నమ్ముతుంటే మరి కొంతమంది కొట్టి పారేస్తున్నారు. మరి దీనిపై రకుల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.