రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు కరోనా సమయంలో దగ్గర అయినట్లు నేరగా రకుల్ యే తెలిపింది. అయితే తమ మధ్య ఉన్నది ప్రేమే అని తెలుసుకుని ప్రపోజ్ చేసుకున్నట్లు, పెళ్లి చేసుకోవాలని భావించినట్లు మూడేళ్ల క్రితమే చెప్పుకొచ్చింది. అయితే మూడేళ్లకు ప్రేమ విషయాన్ని బయట పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మూడు ముళ్ల వేయించుకోబోతున్న వార్తను కూడా ఎవరికీ చెప్పలేదు.
సైలెంట్ గా చేసుకోవాలనుకోగా… వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే టాలీవుడ్ హరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు-నిర్మాత జాకీ భగ్నానిని రకుల్ వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ భారతీయుడు 2 సినిమాతో మళ్లీ మన ముందుకు రానుంది. భారతీయుడు 2తో దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. కమల్ హాసన్, సిద్ధార్థ్, కాజల్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ రకుల్ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.