నడిరోడ్డుపై రాకేష్ మాస్టర్ భార్యపై దాడి,చితక్కొట్టిన మహిళలు.

రాకేష్‌ మాస్టర్‌ మూడో భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మిపై పలువురు దాడి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలో ఆమెపై ఐదుగురు మహిళలు ఒక్కసారిగా వచ్చి దాడిచేశారు. అయితే జులై 7న హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో లక్ష్మి తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా.. యూట్యూబర్ లల్లీ, ఆమె నాలుగు స్నేహితురాళ్లు కలిసి లక్ష్మిని అడ్డగించి నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్టు చితకొట్టారు. ఇక ఆ గొడవని చూసిన కొందరు స్థానికులు 100కి డయల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

వారందర్ని పోలీస్ స్టేషన్ కి రావాలని అందేశించడంతో లక్ష్మి, లల్లీతో సహా అందరూ స్టేషన్ కి చేరుకొని పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ గొడవ గురించి లక్ష్మి మాట్లాడుతూ.. “తన యూట్యూబ్ ఛానల్ ని మూసేయాలంటూ బెదిరిస్తున్నారంటూ లేకుంటే చంపేస్తామంటూ కూడా కొంతకాలంగా బెదిరింపులు వస్తున్నాయని, ఈ క్రమంలోనే నెల్లూరుకి చెందిన భారతి అనే మహిళ లక్ష రూపాయల సుపారీ ఇవ్వడంతోనే ఈ దాడి జరిగిందని” ఆరోపించింది.

దీని పై లల్లీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించింది. లక్ష్మి చెప్పేవి అన్ని అబద్ధాలని, తన కుమార్తె గురించి లక్షి యూట్యూబ్ లో అసహ్యకరంగా మాట్లాడుతూ, బూతులు తిట్టడం వలనే ఆమెను కొట్టినట్లు చెప్పుకొచ్చింది. లక్ష్మి యూట్యూబ్ లో మాట్లాడే మాటలు వల్ల తన కూతురు స్కూల్ కి వెళ్లడం కూడా మానేసిందని, తన కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే ఆమె పై దాడి చేసినట్లు వెల్లడించింది.

లక్ష్మి యూట్యూబ్ మాట్లాడిన మాటలను కూడా పోలీసులకు చూపించినట్లు పేర్కొంది. కాగా, లక్ష్మి.. రాకేశ్ మాస్టర్ వద్ద వంట చేయడానికి జాయిన్ అయ్యింది. ఆ తరువాత పలు యూట్యూబ్ ఛానల్స్ ఆమెను తన భార్యగా రాకేశ్ మాస్టర్ పరిచయం చేయడంతో మూడో భార్యగా అప్పటి నుంచి చలామణి అవుతుంది. ఇప్పుడు లక్ష్మి నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ కూడా రాకేష్ మాస్టర్‌దే అని, ఆ విషయంలో ఈ గొడవ అంతా జరిగిందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *