కొద్ది నెలల క్రితం విజయవాడలో జరిగిన స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ గురించి, ఆయనతో అనుబంధం గురించి, అలాగే నందమూరి బాలకృష్ణ గురించి చెప్పుకొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు విజన్, అలాగే భవిష్యత్‌లో ఆయన అనుసరించబోయే ప్లాన్స్ గురించి గొప్పగా చెప్పారు. అయితే అసలు రజినీకాంత్ కి వైసీపీ నేతలపై విరుచుకుపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వివాదం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజినీకాంత్ హాజరయ్యారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు ని ఆకాశానికి ఎత్తేసి మాట్లాడారు రజినీ. స్వర్గీయ ఎన్టీఆర్ గురించి, ఆయనతో అనుబంధం గురించి, అలాగే నందమూరి బాలకృష్ణ గురించి చెప్పుకొన్నారు. దీంతో వైసీపీ నేతలు రజినీ ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని ఇద్దరు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే రజినీ కేవలం చంద్రబాబు నాయుడుని పొగిడారు తప్పా.. ఎక్కడా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఆయన విమర్శలు చేయలేదు.
వైసీపీ నేతల ఊసు ఎత్తలేదు.. అలాగే రెండు ప్రభుత్వాల పాలనను కంపేర్ చేయలేదు.. ఆయ ఎక్కడా రాజకీయంగా మాట్లాడేలేదు.. కేవలం చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధం కారణంగా ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తారు.. మరి ఆ మాత్రం దానికే రజినీని ఎందుకు వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. అది కూడా ఎవరూ ఊహించని రీతిలో తిట్ల దండకం అందుకున్నారు. అందుకే ఇప్పుడు రజినీకాంత్ ఇలా కౌంటర్స్ వేశారని అంటున్నారు ఆడియన్స్.
She: Show me instant goosebumps and motivation.
— Tharun teja__Saaho (@Mr_inn0cent_) August 8, 2023
Me: Watch this… 🥵🥵🥵🔥🔥🔥#Rajinikanth𓃵 #Prabhas pic.twitter.com/EmNS1Kx5QC