అపార కుబేరుడు అంబానీ ఇంట ఇటీవల పెళ్లి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే.. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజులు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెజెండ్స్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
అయితే అక్కడ జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వేడుకకు హాజరైన సూపర్ స్టార్ రజినికాంత్ ను ఫోటోలు తీసేందుకు మీడియా వాళ్లు సిద్ధమయ్యారు. ఇంతలో ఆయన పక్కన ఉన్న పనిమనిషిని పక్కకు వెళ్ళమని అన్నారు. దాంతో ఆమె వెనక్కు వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ కూడా ఆమెను వెనక్కి పంపించేశారు. ఇప్పుడు ఈ వీడియో పై నెటిజన్ విమర్శలు చేస్తున్నారు.
సూపర్ స్టార్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో నీతులు చెప్పే హీరో ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. అయితే అక్కడున్న ఫొటోగ్రాఫర్లు ఫ్యామిలీ ఫోటో కావాలి అని అడగటంతో రజినీకాంత్ అలా చేశారు అంతే తప్ప.. ఆమెను అవమానించడానికే కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Idhe chiru chesunte kula kukkalu rendu rojulu nonstop yedchevi 😷pic.twitter.com/56y1OjMhzJ
— Andhra Nolan™ (@TheCrazyOne_1) March 3, 2024