జగన్ పై రాజేష్ మహాసేన NON-STOP జోకులు స్టేడియం మొత్తం నవ్వులే నవ్వులు.

రాజేష్ మహాసేన.. చీకటి వచ్చిన తర్వాతే వెలుగు విలువ తెలుస్తుందని, జగన్ అస్తవ్యస్త పాలన చూశాక చంద్రబాబు పాలన ఎంత గొప్పదో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. జగన్ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును దళితద్రోహిగా పేర్కొన్నారని, తాము కూడా జగన్ మాటలు నిజమే అని భావించామని అన్నారు. కానీ త్వరలోనే నిజమైన దళిత ద్రోహి ఎవరో గుర్తించామని పేర్కొన్నారు.

అయితే హైద‌రాబాద్ న‌గ‌రంలో సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏండ్లు పూర్త‌యిన క్ర‌మంలో సాప్ట్ వేర్ ఉద్యోగులు గచ్చిబౌలి స్టేడియంలో ఒక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనిని టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతగా నిర్వ‌హించగా, టీడీపీ నాయ‌కుల‌తో పాటు అనేక మంది ప్ర‌ముఖులు కూడా పాలుపంచుకున్నారు. అలాగే, ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..

తెలుగు ప్ర‌జ‌ల కోసం చంద్ర‌బాబు పాల‌న‌లో చేసిన అభివృద్ధినీ, ముఖ్యంగా ఐటీ ప‌రిశ్ర‌మ ఎదుగుద‌ల‌ను ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. ఏం త‌ప్పు చేశార‌ని చంద్ర‌బాబు అరెస్టు చేశార‌ని ప్ర‌శ్నించిన బండ్ల గ‌ణేశ్.. బాబు కోసం ప్రాణాలు ఇవ్వ‌డానికైనా తాను సిద్ధంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు. దేశ‌విదేశాల్లో చంద్ర‌బాబుకు జై కొడుతుంటే.. రాజ‌మండ్రిలో జైల్లో ఉండ‌టంతో క‌డుపు ర‌గిలిపోతున్న‌ద‌ని క‌న్నీరు పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *