రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లాడిన సుమ.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాలని డిసైడ్ అయినట్లు చెప్పుకున్నారు. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని సుమ చాలా సార్లు క్లారిటీ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. అయితే సుమ-రాజీవ్ కనకాలకు మధ్య విబేధాలు, విడాకుల వరకూ వెళ్లారు అంటూ వచ్చిన వార్తలు చూసి చాలా భయపడ్డా. కానీ సుమ మాత్రం అసలు పట్టించుకునేది కాదు. నేనే కాస్త ఆలోచనలో పడేవాణ్ని.
ఈ వార్తలు చూసిన ఊళ్లల్లో ఉన్న మా బాబాయ్ వాళ్లు, విదేశాల నుంచి స్నేహితులు ఫోన్ చేసిన అడిగేవారు. మేమైతే బాగానే ఉన్నాం.. మా 23 ఏళ్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంది అంటూ చెప్పేవాళ్లం. అయినా ఏదో ఒక మూల నుంచి ఈ వార్త హింసిస్తూనే ఉండేది. ఆ సమయంలోనే ఓ ఐడియాతో ఇద్దరం కలిసి రీల్స్ చేశాం. సుమ చేసే షోలకు నేనే వెళ్లడం చేశాను. అలాగైనా జనాల్లో వీరు కలిసే ఉన్నారని టాక్ వస్తుందని. ఆ రీల్స్ వల్ల ఆ మచ్చ కాస్త కనుమరుగైంది. ఈ మధ్యనే సుమ అమెరికా వెళ్లి వచ్చింది.
తను రాగానే ఇద్దరం ఓ రీల్ చేశాం. అది వైరల్ కావడంతో మేమిద్దరం కలిసే ఉన్నాం అని జనాలకు తెలిసింది. దాదాపు నాలుగేళ్లగా ఇదే రచ్చ. ఈ మధ్యనే కాస్త తగ్గింది. అయితే అసత్య వార్తల వల్ల స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడ్డారు. అదే బాధ కలిగించింది. ఈ విషయంలో నేనే భయపడ్డాను కానీ సుమ చాలా లైట్ తీసుకునేది. తనని చూసి నేను కూడా ఇలాంటివి లెక్కచేయడం మానేశా. మేమిద్దరం మా వ్యక్తిగత. వృత్తి జీవితంలో చాలా ఆనందంగా ఉన్నాం’’ అని రాజీవ్ చెప్పారు.