కమర్షియల్ సినిమాకి తనదైన మార్క్, మీనింగ్ ఇచ్చిన ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనదైన డైలాగ్లతో మాస్ ప్రేక్షకులను కట్టిపడేయగల నేర్పరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ బద్రి’ తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ఆయన కు సినీ ప్రముఖులు , అభిమానులు పెద్ద ఎత్తున విషెష్ అందిస్తున్నారు.
ప్రస్తుతం పూరి జగన్నాధ్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. పూరి బర్త్ డే కావడంతో షూటింగ్ లొకేషన్ లోనే చిత్ర యూనిట్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఇక్కడ మరోక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పూరి జగన్నాధ్ ప్రొడక్షన్ పార్ట్నర్ అయిన నటి ఛార్మి అర్థరాత్రి బర్త్ డే విషెస్ చెబుతూ ఒక పోస్ట్ పెట్టింది. పూరి కేక్ కట్ చేస్తున్న పిక్స్ కూడా ఆమె షేర్ చేసింది. దీనితో ఈ పిక్స్ బాగా వైరల్ గా మారాయి.
హ్యాపీ బర్త్ డే పూరి సర్ అని రాసి ఉన్న కేక్స్ ముందు పూరి ఉన్న ఫోటోలని ఛార్మి షేర్ చేసింది. ఇవి శాశ్వతమైన సెలెబ్రేషన్స్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఇదిలా ఉండగా పూరి జగన్నాద్ మరియు నటి ఛార్మి గురించి ఎన్నో రూమర్స్ ఇటీవల బాగా వినిపిస్తూనే ఉన్నాయి. వారిద్దరూ ప్రొఫెషనల్ గా అయితే పార్ట్నర్స్ గా కోనసాగుతున్నారు. అదే సమయంలో పర్సనల్ లైఫ్ గురించి కూడా రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇవేమి కూడా వారు పట్టించుకోకుండా బిజీ గా గడుపుతున్నారు.