శాండల్‌వుడ్ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూశారు. స్పందన బ్యాంకాక్ పర్యటనలో ఉండగా గుండెపోటుకు గురవడంతో అక్కడే ఆమె మరణించింది. అయితే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన హఠాన్మరణంతో శాండల్ వుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.
కాగా విజయ్ రాఘవేంద్ర పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి దగ్గరి బంధువు . పునీత్ మాతృమూర్తి పార్వతమ్మ రాజ్‌కుమార్ సోదరుడి పిల్లలే విజయ్ రాఘవేంద్ర, శ్రీమురళి. గత కొన్నేళ్లుగా రాజ్‌కుమార్ ఫ్యామిలీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. పునీత్ రాజ్‌కుమార్ మరణం నుంచి నేటి స్పందన మరణం వరకు వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అతని కుటుంబీకులు మనో వేదనకు గురవుతున్నారు. అభిమానులందరూ అప్పు అని పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం రాజ్‌కుమార్ ఫ్యామిలీని బాగా కుంగదీసింది.
ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో చనిపోయాడంటే ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం పునీత్ ఫ్యామిలీతో పాటు అభిమానులను బాగా కుంగదీసింది. పునీత్ రాజ్‌కుమార్ మరణం తర్వాత అశ్విని తీవ్ర మనోవేదనకు లోనైంది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఆమెకు మరో షాక్ తగిలింది. అశ్విని తండ్రి రేవనాథ్ 2000 ఫిబ్రవరి 20న కన్నుమూశారు. భర్తను పోగొట్టుకున్న బాధతో ఉండగానే అశ్విని తండ్రిని కోల్పోయింది.