రెండో పెళ్లిపై తేల్చేసిన పృథ్వి, ఇంట్లో నా కొడుకుతో..?

కొద్దిరోజులుగా పృథ్వీ మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆ వార్తలపై స్పందించారు పృథ్వీ. అయితే ఆ అమ్మాయికి 23 ఏళ్లు కాదని.. 24 అని.. అలాగే.. ఇంకా తమకు పెళ్లి కాలేదని.. ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్‏షిప్‏లో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే పృథ్వి వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు శీతల్. కొరియన్ అయినప్పటికీ ఆమె తెలుగు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారు.

కొరియన్ భాష మాత్రం కొంచెం కొంచెం వచ్చు. పృథ్వి వ్యక్తిత్వం బాగా నచ్చింది. ఆయనతో నా జర్నీ బాగుంటుందనే నమ్మకం ఉంది. అందుకే పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకున్నానని శీతల్ అన్నారు. పెద్ద వయసున్న వ్యక్తిని వివాహం చేసుకుంటాను అంటే… మీ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏమిటి? అని అడగ్గా… వాళ్లకు ఎలాంటి అభ్యంతరం లేదు. అమ్మ, సిస్టర్ ఈ విషయాన్ని అంగీకరించారు. పృథ్వితో వాళ్లకు మంచి సాన్నిహిత్యం ఉందని శీతల్ చెప్పుకొచ్చారు.

57 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే తప్పేంటని పృథ్వి ఎదురు ప్రశ్నించారు. మా ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది. నా వయసు గురించి ఆమెకు తెలుసు. మిగతా వాళ్లకు ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. శీతల్ ని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే ఆలోచన ఉండేది. మీడియాలో నా పెళ్లి వార్త హైలెట్ అయ్యాక ఇక తప్పదని డిసైడ్ అయ్యాను. అప్పటి వరకు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని పృథ్వి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *