ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ మేనియానే కనిపిస్తోంది. ప్రభాస్ సినిమా హిట్ అయితే కాలర్ ఎగరేసుకుని తిరుగుదామా అని ఎదురు చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కి సలార్ మూవీ తలెత్తుకునేలా చేసింది. మరీ ముఖ్యంగా బాహుబలి తరువాత ఆ రేంజ్ హిట్లు లేకపోవడంతో అందరూ సలార్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. వారు అంచనాలను, ఆశలను ఏమాత్రం నిరుత్సాహపర్చకుండా ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ ను చూపించారు.
తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో కార్తికేయ ఈ విషయం మీద స్పందించాడు. తనకు హీరో రవితేజకు బంధుత్వం ఏమీ లేదు అని చెప్పుకొచ్చాడు. అసలు ఈ ప్రచారం ఎలా మొదలైందో ఎందుకు మొదలైందో కూడా తెలియదని, తాను రవితేజ గారి పేరు ఎక్కడా మెన్షన్ కూడా చేయలేదని ఆయన చెప్పుకొచ్చాడు. తాను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నానని నటన మీద ఆసక్తితో కాస్టింగ్ డైరెక్టర్ల ద్వారా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

అలా మొత్తం 160 మందిని ఆడిషన్ చేస్తే సలార్లో తాను ఒక్కడిని మాత్రం ప్రశాంత్ నీల్ కి నచ్చానని అలా ఈ అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు. ఇక సలార్లో నటన చూసి ప్రశాంత్ నీల్ తనను పృథ్వీరాజ్ సుకుమారన్ కే రికమెండ్ చేయడంతో ఆయన లూసిఫర్ 2 సినిమాలో కూడా తనకు చిన్నప్పటి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు. అది కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.