పద్మారావునగర్ కు చెందిన జి.అంజిరెడ్డి నిర్మాతగా కొన్ని తెలుగు సినిమాలు నిర్మించారు. ఆయనకు ముగ్గురు సంతానం. ఒక కుమారుడు మోకిల్లాలో, మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. అయితే అంజిరెడ్డి అమెరికాలో ఉండాలని భావించి పౌరసత్వానికి దరఖాస్తు చేశారు. అయితే హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు.
నిర్మాతను చంపిన రవి కాట్రగడ్డను అదుపు తీసుకున్న పోలీసులు…. నిర్మాత ఆస్తుల కోసమే హత్య చేసినట్లుగా గుర్తించారు. నిర్మాతను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు రవి కాట్రగడ్డ. కమర్షియల్ కాంప్లెక్స్ లోని బేస్మెంట్లో నిర్మాతను చంపి పడవేశాడు రవి కాట్రగడ్డ. ఇద్దరు బిహారీలతో కలిసి నిర్మాత అంజిరెడ్డిని హత్య చేశారు రవి కాట్రగడ్డ. నిర్మాత పేరు మీద ఉన్న పలు భవనాలు కాజేసేందుకే ఈ హత్యను రవి కాట్రగడ్డ చేసినట్లు గుర్తించారు పోలీసులు.
ఆస్తులను అమ్మి అమెరికాకు వెళ్ళిపోవాలని ప్లాన్ చేసిన నిర్మాత అంజిరెడ్డి.. అయితే.. తన ఆస్తులను అమ్మే పని రవికి అప్పజెప్పారట. ఈ తరుణంలోనే ఆస్తులు అన్నింటిని తన పేరు మీద రాయించుకొని నిర్మాతను హత్య చేశాడు రవి కాట్రగడ్డ. ఇద్దరు బిహారీలకు సుపారీ ఇచ్చి హత్య చేశారు రవి కాట్రగడ్డ. అయితే.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అసలు విషయాన్ని గుర్తించి, రవి కాట్రగడ్డని అరెస్ట్ చేశారు.