ప్రియుడు చేసిన పనికి రాత్రి గోవా రోడ్లపై ఏడుస్తూ తిరుగుతున్న ప్రియాంక జైన్.

మౌనరాగం సీరియల్ తో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరింత ఫేమ్ సంపాధించుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ప్రియుడితో కలిసి రచ్చ చేస్తోంది. ఎక్కడకు వెళ్లినా వీరిద్దరూ కలిసే వెళ్లి వస్తున్నారు. పెళ్లి కాకముందే ఒకే ఇంట్లో ఉంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ జంట మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గోవా వెళ్లారు. అయితే ప్రియాంక, శివ కుమార్‌తో పాటు మరో ఇద్దరు గోవా ట్రిప్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడున్న పలు ప్రదేశాలు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు.

ఈ ఫొటోలను ప్రియాంక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే అక్కడ ప్రియాంక కాస్ల ర్యాష్‌గా మాట్లాడిందని వారు ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ఓ లెటర్ రాసి పెట్టి మరీ నీ ప్రవర్తన మాకు నచ్చలేదు అందుకే వదిలేసి వెళ్ళిపోతున్నాము అని రాసి అక్కడ పెట్టి వెళ్లారు. ఇక తెల్లారిన తర్వాత నిద్ర లేచిన తర్వాత చూస్తే ఎవరూ లేకపోవడంతో ఫోన్ చేసింది. వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత అక్కడున్న లెటర్ చూసి విపరీతంగా ఏడ్చేసింది. ఆ తర్వాత తనకు ఏం చేయాలో తెలియక రోడ్లపై వెతికింది.

ఎంత వెతికినా వారు కనిపించకపోవడంతో మళ్లీ ఒకసారి ఫోన్ చేసింది. వారి ఫోన్ కలవకపోవడంతో హోటల్‌లోని రూమ్‌కి వస్తుండగా అప్పడే శివతో పాటు ఇద్దరు స్నేహితులు తనకు కనిపించారు. దీంతో ఊపిరి పీల్చుకుంది. ఒంటరిగా ఉంచడం ఏంటని వారు అడుగుతూ ఏడుపు మొదలెట్టింది. దీంతో ఆమె ప్రియుడు దగ్గరకు తీసుకుని క్షమాపణలు చెప్పడంతో పాటు అదంతా తానే కావాలని ఫ్రాంక్ చేసినట్లు వివరించాడు. ఆ తర్వాత ప్రియాంక శాంతించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన వారు మా ప్రియాంకపై ఇలాంటి ప్రాంక్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *