బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ షో వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. సీరియల్ నటుడు శివ కుమార్ తో ఆమె రిలేషన్ లో ఉంది. ఫ్యామిలీ వీక్ లో శివ కుమార్ హౌస్లోకి వచ్చాడు. అయితే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, సీరియల్ నటుడు శివ కుమార్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న సంగతి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్ లో శివ కుమార్ ను హౌస్లోకి వచ్చాడు.. ఇక అక్కడు వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే హౌస్లో శివ కుమార్ ని పెళ్లి చేసుకుందామని ప్రియాంక అడిగింది.
దానికి శివ కుమార్ కూడా తప్పకుండా హౌస్ నుంచి బయటకి వచ్చిన వెంటనే చేసుకుందాం అని ఆన్సర్ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ ముగిసి చాలా కాలం అవుతోంది. కానీ ఇంకా వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు. దీంతో ఇంకెందుకు లేట్ పెళ్లి చేసుకోవచ్చుగా అని ఈ జోడీని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. ఇక నెటిజన్ల ప్రశ్నలకు వింత సమాధానం ఇచ్చింది ఈ జోడీ. ఆ సమాధానం విని నెటిజన్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఇంతకీ శివ కుమార్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, అంత డబ్బులు సమకూర్చుకోవాలంటే కాస్త టైమ్ పడుతుందని తెలిపింది ఈ జంట. అదీకాక తమ పెళ్లిని గ్రాండ్ గా కొన్ని రోజుల పాటు చేసుకోవాలని ఇద్దరూ భావిస్తున్నారట. అందుకు భారీగానే ఖర్చు అవుతుంది. దీంతో పెళ్లిని కొంత కాలం పాటు వాయిదా వేసి.. భారీగా సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుంటామని శివ కుమార్ తెలిపాడు. అప్పటి వరకు డేటింగ్ చేస్తామని చెప్పుకొచ్చాడు.