ఇప్పటికే తెలుగుతో పాటుగా తమిళ, హిందీ సినిమాల్లో అవకాశాలను అందుకున్న ప్రియమణి..ఇప్పుడు మరో సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అయితే కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. మాలీవుడ్, కోలీవుడ్‌లలో సక్సెస్ కాలేక పోయింది. జగపతిబాబు హీరోగా నటించిన “పెళ్లయిన కొత్తలో” అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ప్రియమణికి మంచి బ్రేక్ లభించింది. ఈ చిత్రంలో తన అందాలన్నీ తెగ ఆరబోయడమేకాకుండా..
తన రొమాన్స్‌తో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. దీంతో యువ అభిమానులు మాత్రమే కాకుడా కుర్రహీరోలు సైతం ఈ ముద్దుగుమ్మపై మనస్సు పారేసుకున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున, రవితేజ.. ఇలా అనేక మంది హీరోల పక్కన కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే, ఇటీవలి కాలంలో ప్రియమణికి అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి.
మంచి శరీర సౌందర్యాలు, విచ్చలవిడిగా రోమాన్స్ చేస్తున్నప్పటికీ.. ఆఫర్లు మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. అటు సొంత రాష్ట్రం కేరళ ప్రేక్షకులకు దగ్గరకాలేక పోయిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్, టాలీవుడ్‌లలో తన కెరీర్‌ను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతోందట. ఇందుకోసం స్విమ్ సూట్స్, బికినీ డ్రెస్‌లతో పాటు.. దర్శకులు ఎలా చెపితే అలా చేసేందుకు సై అంటోందట.