సీజన్ ల మీద సీజన్లు చేస్తూ నిర్వాహకులు కూడా ఫుల్లుగా సంపాధించుకుంటున్నారు. అన్ని సీజన్లకంటే కూడా ఈసారి వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా పదో వారంలో భాగంగా ఫ్యామిలీ వీక్ నిర్వహించడం.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు అంతా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం అద్భుతంగా సాగుతోంది. వారితో హౌస్ మేట్స్ చేసే రచ్చ, ఎమోషన్స్ ను బిగ్ బాస్ బాగానే క్యాచ్ చేస్తూ టీఆర్పీని పెంచేసుకుంటున్నాడు. అయితే తాజాగా శోభా శెట్టి తల్లి, అమర్ దీప్ భార్య వచ్చిన విషయం తెలిసిందే.
అలాగే యావర్ అన్నయ్య కూడా వచ్చాడు.మెయిన్ డోర్ ఓపెన్ చేస్తూ మూస్తూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని టెన్షన్ పెట్టాడు.యావూ.మేర బచ్చా! అని మైక్ లో వినిపించగా యావర్ ముఖంలో వెయ్యి దీపాలు వెలిగాయి.డోర్ దక్కరకు పరుగెత్తుకెళ్లాడు. అక్కడ అన్నయ్య లేడు.ఇంట్లో నుండే యావర్ అన్నయ్య సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరూ గట్టిగా హత్తుకున్నారు.హౌస్ మేట్స్ ని పలకరించేందుకు యావర్ అన్నయ్య రెండు తెలుగు పదాలు నేర్చుకున్నాడు. అనంతరం గౌతమ్ కి కృతజ్ఞతలు చెప్పాడు.గౌతమ్ తల్లి యావర్ ని అక్కున చేర్చుకుని నీకు కూడా నేను అమ్మనే అన్నారు. అందుకే గౌతమ్ కి యావర్ అన్నయ్య థాంక్స్ చెప్పాడు.
వీడికి అమ్మ ప్రేమ అంటే తెలియదు.అమ్మ లేదు అని ఆయన కూడా ఏడ్చేశాడు.అన్నదమ్ములు తల్లిని తలచుకుని ఏడవడం గుండెలు బరువెక్కేలా చేసింది. అది చూసిన శివాజీ పక్కనే ఉండి వాళ్ళను ఓదార్చారు. అంతేకాకుండా అన్నదమ్ములు ఇద్దరు ఏడవటం ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించింది. అనంతరం తమ్ముడు యావర్ ని అన్నయ్య మోటివేట్ చేశాడు.నువ్వు ఫైటర్ వి. పోరాడి కప్పు గెల్చుకుని రా.అందరూ నువ్వు నువ్వు తెచ్చే కప్పు కోసం ఎదురుచూస్తున్నారు. అని చెప్పాడు. అనంతరం ఇంటిని వీడాడు.