హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

ప్రశాంత్ వర్మకి పెళ్లైంది అని ఎక్కువ మందికి తెలిసుండదు. కానీ అతనికి నిజంగానే పెళ్లి అయ్యింది. ప్రశాంత్ వర్మ భార్య పేరు సుకన్య. ‘హనుమాన్’ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ గురించి గూగుల్ లో ఎక్కువ సెర్చ్ లు జరుగుతున్నాయి. అయితే హనుమాన్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ వర్మ గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన హనుమాన్‌ సక్సెస్‌ మీట్‌లో తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని అందరికి పరిచయం చేసి షాకిచ్చాడు ప్రశాంత్‌ వర్మ. ఇంతకు ఆ స్పెషల్‌ పర్సన్‌ ఎవరంటే.. ఆయన భార్య. అవును మీరు విన్నది నిజమే.

ప్రశాంత్‌ వర్మకు పెళ్లైంది. తాజాగా హనుమాన్‌ సక్సెస్‌ మీట్‌ సందర్భంగా భార్యని అందరికి పరిచయం చేశాడు ఈ యంగ్‌ డైరెక్టర్‌. హనుమాన్‌ సక్సెస్‌ మీట్‌ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే.. తన భార్య గురించి మాట్లాడాడు. ఇన్నాళ్ల సినీ ప్రయాణంలో తనకు అన్నీ వేళలా అండగా నిలిచిన భార్యకు థ్యాంక్స్‌ చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించాడు. అలా తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని తొలిసారి అందరికి పరిచయం చేశాడు. ఆయనకు పెళ్లైందనే విషయం తెలిసి.. చాలా మంది ఆశ్చర్యపోయారు. ప్రశాంత్‌ వర్మను చూస్తే.. చాలా యంగ్‌గా కనిపిస్తారు.

అలాంటిది ఆయనకు పెళ్లి ఎప్పుడయ్యింది.. ఇంతకు భార్య పేరు ఏంటి అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు జనాలు. పాలకొల్లుకు చెందిన ప్రశాంత్‌ వర్మకు కరోనా సమయంలోనే వివాహం జరిగింది. ఆయన భార్య పేరు సుకన్య. ఇక వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే ప్రశాంత్‌ వర్మ వివాహం సమయానికి ఆయన పెద్ద దర్శకుడు కాకపోవడంతో.. పెళ్లి గురించి, ఆయన భార్య గురించి ఎవరికి పెద్దగా తెలియలేదు. ఇక ప్రశాంత్‌ వర్మ భార్య సుకన్య ఫొటోలు చూసిన వారు.. ఆమె ఎంతో అందంగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉన్నారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *