ప్రగతి.. జిమ్ లో వర్కౌట్ లు చెయ్యడం మాత్రమే కాకుండా.. రకరకాలుగా జంప్ చేస్తూ ఆశ్చర్యపరిచింది. ‘ఇక నుండీ బోల్డ్ పాత్రలు చెయ్యడానికి కూడా నేను రెడీ’ అన్నట్టు ఈమె ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తున్నట్టు నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఏమైనా 44ఏళ్ళ వయసులో కూడా ఇంతలా ఆమె కష్టపడుతుండడం మామూలు విషయం కాదనే చెప్పాలి.
అయితే ఎక్కువగా జిమ్ వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. రెగ్యులర్ గా తాను జిమ్(Gym) లో కష్టపడుతున్న వీడియోల్ని పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఈ ఏజ్ లో కూడా జిమ్ లో అంత కష్టపడుతున్నారంటే గ్రేట్ అని పలువురు కామెంట్స్ చేస్తూ ప్రగతిని అభినందిస్తారు. రెగ్యులర్ గా జిమ్ డ్రెస్ లో వీడియోలు పోస్ట్ చేస్తుండగా తాజాగా చీరలో జిమ్ వీడియో పోస్ట్ చేయడం విశేషం.
ప్రగతి చీర కట్టుకొని జిమ్ లో 90 కేజీల బరువు ఈజీగా మోసేసింది. దీంతో ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 90 కేజీల బరువు మోయడం, అది కూడా చీరలో ఇలా మోయడం నిజంగా గ్రేట్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రగతి రెండో పెళ్లి గురించి రూమర్స్ రాగా వాటిని సీరియస్ గా ఖండించింది.