పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో కల్కితో పాటు మరో ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మారుతితో హారర్ కామెడీ చిత్రంగా ‘రాజా డీలక్స్’ ఉండగా.. మరో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ మూవీ, ఆర్కా మీడియా పతాకంపై ఓ చిత్రం ఉంది.
అయితే వరుస సినిమాలతో అదరగొడుతోన్న ప్రభాస్ వరుసగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఓసారి సర్జరీ జరిగిందని సమాచారం. ఇక లేటెస్ట్‌గా మరోసారి కాలుకు సర్జరీ జరుగనుందని తెలుస్తోంది. బాహుబలి సమయంలో ఓ యాక్షన్ సీన్‌లో ప్రభాస్ కాలుకి గాయం అయ్యిందట. ఆ గాయం ఆయన్ను అప్పటి నుంచి వెంటాడుతూనే ఉంది.
ఇక లేటెస్ట్‌గా మరోసారి ఆ గాయం కారణంగా ఆయన ఇబ్బందులు పడుతున్నారట. ఈ కారణంగా ఆయన సలార్, కల్కి షూటింగ్ పూర్తి అయ్యిన తర్వాత చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోంది. సర్జరీ అనంతరం ప్రభాస్ కొన్ని నెలలు పూర్తి విశ్రాంతిలో ఉంటారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.