వామ్మో, ఈ సినిమా కి ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

ప్రభాస్ ఫ్లాప్ సినిమా కూడా నార్త్ లో వంద-నూటాయాభై కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది అంటే ప్రభాస్ ని నార్త్ ఆడియన్స్ ఏ రేంజులో ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ టు నార్త్… అమలాపురం టు అమెరికా, సెంటర్ ఏదైనా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కోట్ల వర్షం కురవాల్సిందే. అయితే గత కొద్ది కాలం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ప్రభాస్. ఈ సినిమాకు కూడా ఆయన రూ. 100 కోట్లు పారితోషికం అందుకుంటున్నారట.

దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా తన స్థానాన్ని మళ్లీ సుస్థిరం చేసుకున్నారట ప్రభాస్. అంతేకాదు, ఈ సినిమా బాక్సాఫీస్ లాభాల్లో 10% అదనంగా ప్రభాస్ అందుకోబోతున్నారట. తన ఇటీవలి చిత్రం ‘ఆదిపురుష్’ కోసం, శ్రీరాముడి పాత్రను పోషించినందుకు రెబల్ స్టార్ రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

సినిమాలో శృతిహాసన్ ‘ఆధ్య’ అనే జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. రవి బాస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా ‘సలార్’ మూవీ రాబోతుందని తాజాగా విడుదల చేసిన టీజర్ లో స్పష్టం చేశారు మేకర్స్. ‘సలార్’ పార్ట్ -1 ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *