బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోలేక పోయాడు.ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచింది. అయినప్పటికీ ఈయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్. అయితే ఈయన పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయి ఫాలోయింగ్ తెచుకున్నప్పటి నుండి ఈయన మీద బురద చల్లడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభాస్ బట్టతల వచ్చేసి అదోలాగా వీక్ గా ఉన్నట్లు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఈ ఫోటోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ ఎందుకు ఇలా అయిపోయాడు, ఏమైనా జబ్బు వచ్చిందా, ప్రాణాపాయ స్థితి ఎందుకు, ఏంటి అని అభిమానులు బాధపడుతూ చూస్తున్నారు. కానీ నిజానికి అది ప్రభాస్ నిజమైన ఫోటో కాదు. కావాలనే ప్రభాస్ ఫోటోను మార్చేసి మార్ఫింగ్ చేసి నెట్ ఇంట్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకిలా అయ్యాడని ఆందోళనకు గురయ్యారు. ఈ ఫోటోలో ఎటువంటి నిజం లేదు. కొందరు కావాలనే ఇలా సృష్టించి ప్రభాస్ పై ఉన్న అసూయ బట్టబయలు చేసి ప్రభాస్ అభిమానులు ఫైర్ అయ్యేలా చేస్తున్నారు.
ఇక ప్రభాస్ తర్వాతి సినిమా ‘ సలార్ ‘ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అయిన ప్రభాస్ ను హై రేంజ్ లో ఉంచుతుందో లేదో చూడాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న అవి సరిగా సక్సెస్ కావడం లేదు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టుకే , రాజా డీలక్స్ , స్పిరిట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించినన్నారు.