పోస్టాఫీస్ అద్దిరిపోయే స్కీమ్, రూ.520 కడితే చాలు రూ.10 లక్షలు మీసొంతం.

దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజల కోసం పోస్టాఫీసు అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈరోజు మేము మీకు పోస్ట్ ఆఫీస్ గ్రామీణ పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద గ్రామ సుమంగల్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి సమాచారాన్ని అందించబోతున్నాము. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతదేశంలోని గ్రామీణ జనాభా కోసం రూపొందించబడింది. అయితే కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల్ని తీసుకొస్తోంది.

డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ల్, ఎల్‌ఐసీ వంటివి ఉన్నప్పటికీ ముఖ్యంగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అందులోనూ పోస్టాఫీస్ పథకాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనికి కేంద్రం మద్దతు ఉండటం, ఆకర్షణీయ వడ్డీ రేట్లు ఉండటం, మంచి రిటర్న్స్ వస్తుండటం కారణంగా చెప్పొ్చ్చు.

ఇప్పుడు పదేళ్ల లోపు ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, మహిళా ఇన్వెస్టర్ల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజెన్ల కోసం సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల కోసం పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ల కోసం టైమ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనకు డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు కనిష్ట, గరిష్ట పరిమితులు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *