బ్రేకింగ్ న్యూస్, పూనమ్ పాండే అరెస్ట్. భారీ జరిమానా కూడా..?

పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయారన్న వార్త శుక్రవారం దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. సెలబ్రిటీలంతా షాకయ్యారు. ఆమె మేనేజర్ సైతం ఈ వార్తను ధృవీకరించడంతో అంతా నిజమని నమ్మారు. క్యాన్సర్ మహమ్మారికి చిన్న వయసులో పాండే బలైపోయారంటూ వార్తలు రాసారు. సర్వైకల్ క్యాన్సర్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై దేశమంతా చర్చించింది. ఇదిలా ఉండగా పాండే అకస్మాత్తుగా సోషల్ మీడియాలో వీడియోలతో ప్రత్యక్షమయ్యారు.

అయితే అనేక అనుమానాల నేపథ్యంలో శనివారం, పూనమ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. తాను సజీవంగా ఉందని తెలియజేసింది. తనకు క్యాన్సర్ కూడా లేదని నటి స్వయంగా వెల్లడించింది, అయితే గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఇదంతా చేశానని పేర్కొన్నారు. నిన్న పూనమ్ పాండే కాన్పూర్ వాసి అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ముంబైలో ఆమె మృతదేహం ఎక్కడుందో తెలియకపోవడంతో ఒక వేళ కాన్పూర్ తీసుకు వస్తారేమో అని అక్కడి పోలీసులు అలెర్ట్ అయ్యారు.

శుక్రవారం, కాన్పూర్ పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ బృందాలు పూనమ్ పాండే యొక్క కాన్పూర్ కనెక్షన్ కోసం రోజంతా వెతికినా, ఎటువంటి సమాచారం దొరకలేదు. ఒక రోజు మొత్తం విచారణ చేసిన తర్వాత పూనమ్ పాండేకి కాన్పూర్‌తో ఎలాంటి సంబంధం లేదని తేలిందట. కాన్పూర్‌ నగరంలోని స్థానిక పోలీసులతో పాటు నిఘా విభాగం కూడా నిన్న చురుగ్గా పనిచేసి ఉరుకులు పరుగులు పెట్టింది. పూనమ్ పాండే యొక్క కాన్పూర్ కనెక్షన్ కోసం బృందాలు వారి సంబంధిత మూలాల నుండి వెతుకుతూనే ఉన్నా కానీ ఏమీ తెలియలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *