వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజ మూర్తి, తండ్రి చనిపోవడంతో..?

పూజా మూర్తి ఎంట్రీ కోసం ఏవీ కూడా సిద్ధమైపోయింది. వేదికపై డ్యాన్స్ చేసేందుకు ఆమె ప్రాక్టీస్ చేసింది. ఇంతలో ఆమె తండ్రి చనిపోయారనే వార్త వచ్చింది. గుండె సమస్యతో ఆయన అకాలమరణం చెందారనే వార్త తెలియగానే.. ఆమె తన స్వగ్రామానికి బయల్దేరి వెళ్లిపోయింది. అలా.. ‘బిగ్ బాస్’ అవకాశాన్ని కోల్పోయింది. అయితే ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున.

నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శవాలి, యూట్యూబర్, నటి నయని పావని, సోషల్ మీడియా పర్సన్, ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తున్న అశ్విని శ్రీ, సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తిలను నాగార్జున వేదికపైకి పిలిచి బిగ్‌బాస్ హౌస్ లోకి పంపించాడు. సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న పూజా మూర్తి షోలోకి వచ్చింది. సీరియల్స్ లో నటిగా, పలు టీవీ షోలతో కూడా పూజా మూర్తి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా గుండమ్మ కథ అనే సీరియల్ లో ముఖ్య పాత్ర చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది. నటి అవ్వాలని ఉన్నా ఎక్కువ బరువు ఉందని చాలా విమర్శలు ఎదుర్కొంది.

అయినా ప్రయత్నించి నటిగా మారింది. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉంది. అయితే పూజా మూర్తి ఈ సీజన్ బిగ్ బాస్ మొదలైనప్పుడే రావాల్సి ఉంది. సెలెక్ట్ అయి రావడానికి మొత్తం ప్రిపేర్ అయింది. కానీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందే వాళ్ళ నాన్న చనిపోవడంతో ఆగిపోయింది. ఇప్పుడు అయిదు వారాల తర్వాత ఆ బాధని దిగమింగుకొని వచ్చింది. నాన్న నన్ను ఇందులో చూడాలి అనుకున్నాడు అందుకే ఇప్పుడు వచ్చాను అని బిగ్ బాస్ స్టేజిపై చెప్తూ ఎమోషనల్ అయింది పూజా మూర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *