తెలుగు టెలివిజన్ షోలో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ షో పేరు సంపాదించింది. గేమ్ షో కి మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత మన దగ్గర బుల్లితెర పైన గేమ్ షోలు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ సూపర్ స్టార్ ఆ గేమ్ కి హోస్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో ఎన్నో విమర్శలను అందుకుంది.
ఇప్పటికే చాలామంది దీనిపై విమర్శలు కురిపించారు. షో ను కూడా ఆపివేయాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. తాజాగా సీజన్ సెవెన్ కి ప్రారంభానికి ముందే సవాళ్లు ఎదురవుతున్నాయి. వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా బిగ్బాస్ నిర్వహకులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ను జాగ్రత్త వహించాలని, పోలీసులు షో నిర్వాహకులకు తెలిపారు. గత అనుభవాల ప్రకారంగా కాంట్రవర్సీ కంటెస్టెంట్లు మధ్య అప్రమత్తం వహించాలని అన్నారు.
బిగ్ బాస్ సెలక్షన్స్ సమయంలో కాస్టింగ్ కౌచ్ అంశాలు తెరపైకి రావడంతో అలాంటి వాటికి తావు లేకుండా ముందస్తు జాగ్రత్త పాటించాలని నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు పోలీసులు. షో లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బయట చేసే హడావుడి విషయంలో పూర్తి బాధ్యత వహించాలని బయట సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవని పోలీసులు నిర్వహకులకు తెలిపారు. మొత్తానికి బిగ్ బాస్ షో మొదలవ్వకముందే పెద్ద సమస్యను ఎదుర్కొంది.