హీరోయిన్ రవళి గుర్తుందా? 1996లో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో తన అందం, అభినయంతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ మాజీ హీరోయిన్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే తొలిసారిగా ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత రియల్ హీరో సినిమాలో నటించేగా అదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.
ఇక 1996లో విడుదలైన పెళ్లి సందడి సినిమాతో మాత్రం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీ, కన్నడ భాషలలో కూడా పలు అవకాశాలు అందుకుంది.ఇక చివరిగా 2006లో స్టాలిన్ సినిమాలో నటించి అందులో కూడా తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాల్లో కూడా కనిపించకపోగా పలు ఈవెంట్లలో మాత్రం దర్శనమిస్తుంది.ఇక ఈమె 2007లో నీలికృష్ణని వివాహం చేసుకుంది.
ఇక వీరికి ఒక కూతురు కూడా ఉంది.ఇక రవళి సోదరి హరిత కూడా టాలీవుడ్ బుల్లితెర నటి అన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె కొన్నాళ్లు బుల్లితెరపై కూడా నటించింది.జెమినీలో ప్రసరమైన నమో వెంకటేశ సీరియల్లో నటించింది.ఇక ఈమె 2009లో తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో తమ పార్టీ తరఫున జోరు ప్రచారాలు కూడా చేసింది.ఇక రవళికి అప్సర, శైలజ అనే మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి.చాలా వరకు ఈ పేర్లు ఎవరికీ తెలియవు.
